ర్యాగింగా? బెట్టింగా? | Polytechnic student suicide | Sakshi
Sakshi News home page

ర్యాగింగా? బెట్టింగా?

Mar 25 2016 12:25 AM | Updated on Nov 6 2018 7:56 PM

ర్యాగింగా? బెట్టింగా? - Sakshi

ర్యాగింగా? బెట్టింగా?

ఓ పాలిటెక్నిక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా వలిగొండ మండలం గోకారంలో గురువారం చోటుచేసుకుంది.

పాలిటెక్నిక్ విద్యార్థి ఆత్మహత్య


వలిగొండ: ఓ పాలిటెక్నిక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా వలిగొండ మండలం గోకారంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పాలకూర్ల భాస్కర్ కుమారుడు భానుప్రసాద్ (17) అబ్దుల్లాపూర్‌మెట్టు సమీపంలోని అర్జున్ కళాశాలలో పాలిటెక్నిక్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు.  ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.


ఇది చూసిన అతని సోదరుడు 108కు సమాచారం ఇవ్వగా.. పరీక్షించిన సిబ్బంది అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అయితే, భానుప్రసాద్ మృతికి ర్యాగింగా, లేక క్రికెట్ బెట్టింగ్ కారణమా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తమ కుమారుడిని అతడి స్నేహితులు మారుతి, కార్తీక్, మరికొందరు బెదిరించడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు భానుప్రసాద్ తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement