అసభ్యంగా ప్రవర్తించిన వార్డెన్‌ పై కేసు నమోదు | Police arrest hostel warden for harassing girls | Sakshi
Sakshi News home page

అసభ్యంగా ప్రవర్తించిన వార్డెన్‌ పై కేసు నమోదు

Jan 22 2017 12:56 PM | Updated on Sep 26 2018 6:09 PM

అసభ్యంగా ప్రవర్తించిన వార్డెన్‌ పై కేసు నమోదు - Sakshi

అసభ్యంగా ప్రవర్తించిన వార్డెన్‌ పై కేసు నమోదు

ప్రైవేట్‌ హాస్టల్‌ వార్డెన్‌గా పని చేస్తున్న యువకుడు ఓ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన మేడ్చల్‌లో ఆదివారం వెలుగుచూసింది.

మేడ్చల్‌: ప్రైవేట్‌ హాస్టల్‌ వార్డెన్‌గా పని చేస్తున్న యువకుడు ఓ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన మేడ్చల్‌లో ఆదివారం వెలుగుచూసింది. స్థానిక హైటెక్‌ మోడ్రన్‌ హైస్కూల్‌లో వార్డెన్‌గా పని చేస్తున్న రవితేజ అదే హాస్టల్‌లో ఉంటున్న బాలికల పట్ల గత కొన్నిరోజులుగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ క్రమంలో ఓ విద్యార్థిని విషయం తన తల్లికి చెప్పడంతో.. విషయం బయటకు వచ్చింది.

దీంతో ఆగ్రహించిన విద్యార్థిని తల్లిదండ్రులు మేడ్చల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement