లక్ష్మీనర్సుపేట కేజీబీవీ (కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం) ప్రత్యేక అధికారి ఎస్.లలితకుమారి పని తీరుపై రాజీవ్ విద్యా మిషన్ (ఆర్వీఎం) పీఓ ఎస్.త్రినాథరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. కేజీబీవీని ఆయన గురువారం పరిశీలించారు. పాఠశాలలో పారిశుద్ధ్య నిర్వహణ బాగులేదన్నారు. ఇటీవలే 24 మంది బాలికలు అతిసారతో అస్వస్థతకు గురై ప్రస్తుతం తేరుకున్నారని, ఇప్పటికీ గుణపాఠం తెచ్చుకోకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు.
కేజీబీవీ ఎస్‌వో తీరుపై పీవో అసంతృప్తి
Sep 29 2016 11:20 PM | Updated on Sep 4 2017 3:31 PM
ఎల్.ఎన్.పేట: లక్ష్మీనర్సుపేట కేజీబీవీ (కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం) ప్రత్యేక అధికారి ఎస్.లలితకుమారి పని తీరుపై రాజీవ్ విద్యా మిషన్ (ఆర్వీఎం) పీఓ ఎస్.త్రినాథరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. కేజీబీవీని ఆయన గురువారం పరిశీలించారు. పాఠశాలలో పారిశుద్ధ్య నిర్వహణ బాగులేదన్నారు. ఇటీవలే 24 మంది బాలికలు అతిసారతో అస్వస్థతకు గురై ప్రస్తుతం తేరుకున్నారని, ఇప్పటికీ గుణపాఠం తెచ్చుకోకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు.
మీ పిల్లలు చదువుకునే పాఠశాలల ప్రాంగణం ఇలా ఉంటే మీకు ఎలా అనిపిస్తోందని నిలదీశారు. తక్షణమే వాడుక నీరు మళ్లించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మేడపై నాచుపట్టి ఉందని, ట్యాంకులు ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని సూచించారు. సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలన్నారు. విద్యార్థినులతో కాసేపు మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఆయన వెంట గ్రామ పెద్దలు ముగడ జనార్దనరావు, దేవరశెట్టి తిరుమలరావు, ఊణ్ణ పకీరు, పరీక్షల పర్యవేక్షణ అధికారి కె.తేజేశ్వరరావులు ఉన్నారు.
Advertisement
Advertisement