ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి | please sucuss chalo delhi program | Sakshi
Sakshi News home page

ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

Jul 17 2016 8:58 PM | Updated on Sep 4 2017 5:07 AM

ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

ఎస్సీ వర్గీకరణ వెంటనే చేపట్టాలని, పార్లమెంట్‌ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టి వెంటనే ఆమోదించాలని కోరుతూ ఈ నెల 19 నుంచి ఆగష్టు 12 వరకు ఢిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద ఎమ్మార్పీస్‌ నేత మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షలలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చెయాలని మాదిగ మహిళ సమాఖ్య జిల్లా అధ్యక్షరాలు మారేపల్లి సావిత్రమ్మ కోరారు.

కోదాడ:  ఎస్సీ వర్గీకరణ వెంటనే చేపట్టాలని,  పార్లమెంట్‌ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టి వెంటనే ఆమోదించాలని కోరుతూ ఈ నెల 19 నుంచి ఆగష్టు 12 వరకు ఢిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద ఎమ్మార్పీస్‌ నేత మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షలలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చెయాలని మాదిగ మహిళ సమాఖ్య జిల్లా అధ్యక్షరాలు మారేపల్లి  సావిత్రమ్మ కోరారు. ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెడతామని చెప్పిన బీజేపీ రెండు సంవత్సరాలు పూర్తవుతున్నా నేటికి ఆ విషయాన్ని పట్టించుకోక పోవడం అన్యాయమన్నారు.  ఈ నెల 29న మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడతున్నందున కోదాడ నుంచి మహిళలు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఈ సమావేశంలో మాతంగి శైలజ, గోళ్ల సుజాత, పిడమర్తి నాగేశ్వరి, బోడ శ్రీరాములు, ఏపూరి రాజు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement