హెడ్‌ రెగ్యులేటర్‌ నిర్మాణానికి స్థల పరిశీలన | place survey for Building Head Regulator | Sakshi
Sakshi News home page

హెడ్‌ రెగ్యులేటర్‌ నిర్మాణానికి స్థల పరిశీలన

Apr 29 2017 11:51 PM | Updated on Sep 27 2018 5:46 PM

ప్రకాశం జిల్లా దోర్నాల ప్రాంతంలోని కొత్తపల్లి గ్రామం వద్ద వెలిగొండ ప్రాజెక్టు హెడ్‌ రెగ్యులేటర్‌ నిర్మాణానికి నిపుణుల కమిటీ సభ్యులు..స్థలాన్ని పరిశీలించారు.

శ్రీశైలం ప్రాజెక్టు: ప్రకాశం జిల్లా దోర్నాల ప్రాంతంలోని కొత్తపల్లి గ్రామం వద్ద వెలిగొండ ప్రాజెక్టు హెడ్‌ రెగ్యులేటర్‌ నిర్మాణానికి  నిపుణుల కమిటీ సభ్యులు..స్థలాన్ని పరిశీలించారు. రిటైర్డ్‌ ఈఎన్‌సీ బి ఎస్‌ ఎన్‌ రెడ్డి, రిటైర్డు చీఫ్‌ ఇంజనీర్లు సుబ్బారావు, రౌతు సత్యనారాయణలు ఆ ప్రాంతాన్ని పరిశీలించినట్లు జలవనరుల శాఖ ఎస్‌ఈ మల్లికార్జునరెడ్డి శనివారం తెలిపారు. నిపుణుల కమిటీ సభ్యులు.. శ్రీశైలం రిజర్వాయర్‌ వెనుక భాగం నుంచి కృష్ణానదిలో కొల్లంవాగుకు చేరుకుని ఆ ప్రాంతంలో హెడ్‌రెగ్యులేటర్‌ను నిర్మించేందుకు రవాణా మార్గాలను, నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించినట్లు ఆయన చెప్పారు. శ్రీ’శైల జలాశయానికి 21. కి.మీటర్ల నదీ మార్గ పరిధిలో కొల్లంవాగు ప్రదేశం ఉంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement