నిమ్స్ లో ఫిజియోథెరపీ విద్యార్థి ఆత్మహత్య | physiotherapy student commits suicide in NIMS | Sakshi
Sakshi News home page

నిమ్స్ లో ఫిజియోథెరపీ విద్యార్థి ఆత్మహత్య

Nov 9 2015 12:07 PM | Updated on Nov 6 2018 7:56 PM

నిమ్స్ లో ఫిజియోథెరపీ విద్యార్థి ఆత్మహత్య - Sakshi

నిమ్స్ లో ఫిజియోథెరపీ విద్యార్థి ఆత్మహత్య

నగరంలోని నిజామ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(నిమ్స్) లో సోమవారం ఉదయం ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

హైదరాబాద్: నగరంలోని నిజామ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(నిమ్స్) లో సోమవారం ఉదయం ఓ వైద్య విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిమ్స్ లో ఫిజియోథెరిపీ ఇంటర్న్ షిప్  చేస్తున్న విజయ్ కుమార్(24) అనే విద్యార్థి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నిమ్స్ పాత బిల్డింగ్ లోని 6 ఫ్లోర్ లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

మృతుడి స్వస్థలం మెదక్ జిల్లా పటాన్ చెరువు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. అధికారులు విజయ్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఆత్మహత్యకు గల కారణాలు, సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement