కేయూలో ఘనంగా ఫార్మసీ డే వేడుకలు | Pharmacy Day celebrations held ku | Sakshi
Sakshi News home page

కేయూలో ఘనంగా ఫార్మసీ డే వేడుకలు

Sep 26 2016 12:22 AM | Updated on Sep 4 2017 2:58 PM

తెలంగాణ ఫార్మా స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ (టీపీఎస్‌ఏ) ఆధ్వర్యంలో ఆదివారం కాకతీయ యూనివర్సిటీలో వరల్డ్‌ ఫార్మసీ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా అసోసియేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు అమ్మ వేణు కేక్‌ కట్‌ చేసి మాట్లాడారు. సమాజంలో ఫార్మసిస్ట్‌ డేకు తగిన గౌరవం లేకపోవడం విచారకరమన్నారు. ఫార్మసీ లైసెన్సులను అద్దెకు ఇచ్చే సంస్కృతి తొలగిపోయి సొంతంగా మెడికల్‌ షాపులను నిర్వహించినప్పుడే అందరికి తగిని వైద్యం

కేయూ క్యాంపస్‌ : తెలంగాణ ఫార్మా స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ (టీపీఎస్‌ఏ) ఆధ్వర్యంలో ఆదివారం కాకతీయ యూనివర్సిటీలో వరల్డ్‌ ఫార్మసీ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా అసోసియేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు అమ్మ వేణు కేక్‌ కట్‌ చేసి మాట్లాడారు. సమాజంలో ఫార్మసిస్ట్‌ డేకు తగిన గౌరవం లేకపోవడం విచారకరమన్నారు. ఫార్మసీ లైసెన్సులను అద్దెకు ఇచ్చే సంస్కృతి తొలగిపోయి సొంతంగా మెడికల్‌ షాపులను నిర్వహించినప్పుడే అందరికి తగిని వైద్యం లభిస్తుందన్నారు. ఇతర దేశాలల్లో ఫార్మసిస్టుకు డాక్టర్‌తో సమానంగా గౌరవం ఉంటుందన్నారు. 1948 ఫార్మసీ యాక్ట్‌ అమలుకు నోచుకోవటంలేదని తెలిపారు. కార్యక్రమంలో టీపీఎస్‌ఏ బాధ్యులు డాక్టర్‌ మహేందర్‌రెడ్డి, అల్లి రమేష్, దినేష్, హరిహాసన్‌, క్రాంతి, ప్రశాంత్, రాకేష్, ఫార్మసీ విద్యార్థులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement