నూతన సంవత్సరం రోజున పెట్రో ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. గత నెల 17వ తేదీ పెట్రోలుపై రూ.2.71, డీజిల్‌పై రూ.2.41లు పెరిగిన ధరలు మరవకముందే మరోమారు పెట్రో ధరలు
– రోజుకు పెరిగే భారం రూ.11.73 లక్షలు
ఒంగోలు: నూతన సంవత్సరం రోజున పెట్రో ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. గత నెల 17వ తేదీ పెట్రోలుపై రూ.2.71, డీజిల్‌పై రూ.2.41లు పెరిగిన ధరలు మరవకముందే మరోమారు పెట్రో ధరలు పెంచుతూ కేంద్ర పెట్రోలియం శాఖ ఆదివారం ప్రకటించింది. తాజా పెంపుదల ప్రకారం ప్రతి లీటరు పెట్రోలుపై రూ.1.29లు, డీజిల్‌పై రూ.0.97లు పెంచారు. అయితే పెట్రోలియంపై వ్యాట్ టాక్స్ ప్రతి లీటరుకు 41 పైసలు అదనం. డీజిల్‌పై వ్యాట్ 22 పైసలు పెరుగుతుంది. దీనిద్వారా పెట్రోలుపై ప్రతి లీటరుకు రూ.1.70లు, డీజిల్‌పై రూ.1.19లు పెరుగుతుంది. జిల్లాలో ప్రస్తుతం రోజుకు 2 లక్షల లీటర్ల పెట్రోలు వినియోగిస్తున్నారు. దీని ప్రకారం రోజుకు రూ.3.40 లక్షల భారం పడుతుంది. ఇక డీజిల్ వినియోగం రోజుకు జిల్లాలో 7 లక్షల లీటర్లు. దీని ప్రకారం రోజుకు డీజిల్ వినియోగంపై పడే భారం రూ.8.33 లక్షలు. మొత్తంగా పెట్రోలు, డీజిల్ వినియోగంపై రోజుకు పెరుగుతున్న భారం రూ.11.73 లక్షలు. ఆర్టీసీ రోజుకు 50 వేల లీటర్ల డీజిల్ వినియోగిస్తున్నందున దానిపై కూడా రోజుకు రూ.59,500లు అదనపు భారం తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ధరలు మరోమారు పెంచక తప్పదనే భావన ఆర్టీసీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.