జిన్నూరు (పోడూరు) : జిన్నూరులో పురుగు మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పురుగు మందు తాగి వ్యక్తి బలవన్మరణం
Aug 29 2016 1:38 AM | Updated on Nov 6 2018 8:04 PM
జిన్నూరు (పోడూరు) : జిన్నూరులో పురుగు మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. జిన్నారు గ్రామానికి చెందిన రావి యోహాను (54) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతని భార్య గల్ఫ్‌లో ఉంటుంది. ఏడేళ్లుగా ఆమె స్వగ్రామానికి రాలేదు. ఈ నేపథ్యంలో గల్ఫ్ నుంచి వచ్చేయాలని యోహాను కొంతకాలంగా భార్యను ఒత్తిడి చేస్తున్నాడు. అయినా ఆమె రాకపోవడంతో మనస్తాపం చెంది పురుగు మందు తాగాడు. స్థానికులు అతడ్ని పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. మృతునికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. పాలకొల్లు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Advertisement
Advertisement