సత్యదేవుని వ్రతాల్లో జర్నలిస్టులకు అవకాశం | opportunity for journalists in Satyanarayana Swamy Vratam | Sakshi
Sakshi News home page

సత్యదేవుని వ్రతాల్లో జర్నలిస్టులకు అవకాశం

Feb 26 2017 10:58 PM | Updated on Sep 5 2017 4:41 AM

సత్యదేవుని వ్రతాల్లో జర్నలిస్టులకు అవకాశం

సత్యదేవుని వ్రతాల్లో జర్నలిస్టులకు అవకాశం

పెదవాల్తెరు కరకచెట్టు పోలమాంబ ఆలయంలో మార్చి 5న నిర్వహించనున్న సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాల్లో పాత్రికేయులు పాల్గొనవచ్చని

డాబాగార్డెన్స్  (విశాఖ దక్షిణ) : పెదవాల్తెరు కరకచెట్టు పోలమాంబ ఆలయంలో మార్చి 5న నిర్వహించనున్న సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాల్లో పాత్రికేయులు పాల్గొనవచ్చని వీజేఎఫ్‌ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, కార్యదర్శి ఎస్‌.దుర్గారావు తెలిపారు. హిందూ ధర్మపరిరక్షణ ట్రస్ట్, దేవాదాయ శాఖ, అన్నవరం వీరవేంకట సత్యనారాయణస్వామి దేవస్థానం సంయుక్తంగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారన్నారు.

వీజేఎఫ్‌ ప్రెస్‌క్లబ్‌లో శనివారం పోస్టర్‌ ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ కరకచెట్టు పోలమాంబ దేవాలయం, ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ వెబ్‌ చానల్స్‌ సంయుక్తంగా నిర్వహించనున్న ఉచిత సత్యనారాయణస్వామి వ్రతాల్లో జర్నలిస్టులు పాల్గొనాలని కోరారు. వివరాలకు 9154576846, 9246673421 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు. కార్యక్రమంలో వీజేఎఫ్‌ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement