బాణసంచా పేలి వివాహిత దుర్మరణం | One woman killed in crackers explosion | Sakshi
Sakshi News home page

బాణసంచా పేలి వివాహిత దుర్మరణం

Nov 13 2016 1:37 AM | Updated on Sep 4 2017 7:55 PM

బాణసంచా పేలి వివాహిత దుర్మరణం

బాణసంచా పేలి వివాహిత దుర్మరణం

ఇందుకూరుపేట : బాణసంచా పేలి ఓ వివాహిత దుర్మరణం చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన మండలంలోని నిడిముసలిలో చేపల గుంత వద్ద శుక్రవారం అర్ధరాత్రి జరిగింది.

  •  మరొకరికి తీవ్ర గాయాలు
  • ఇందుకూరుపేట : బాణసంచా పేలి ఓ వివాహిత దుర్మరణం చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన మండలంలోని నిడిముసలిలో చేపల గుంత వద్ద శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.. నిడిముసలికి చెందిన గాలి యాకోబు తుమ్మాలమ్మ గుడి వద్ద చేపల గుంత సాగు చేస్తున్నాడు. ఇతనికి అదే ప్రాంతానికి చెందిన గోని విజిత (37)తో వివాహేతర సంబందం ఉంది. ఈ నేపథ్యంలో ఇరువురు ఇంటి నుంచి వెళ్లి శుక్రవారం అర్ధరాత్రి గుంత వద్దనే ఉన్నారు. వేకువ జామున సమయంలో చలిగా ఉండటంతో చలిమంట వేసుకున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు గుంతల మీద పిట్టలను తరిమేందుకు తీసుకు వచ్చి వసారాలో ఉంచిన బాణసంచాపై నిప్పు రవ్వలు ఎగిరి పడ్డాయి. దీంతో అవి పేలడంతో ఇద్దరు మంటల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో విజిత మృతి చెందగా తీవ్రంగా గాయపడిన యాకోబు చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ షరీఫ్‌ తెలిపారు. మృతురాలికి భర్త, పిల్లలు ఉన్నారు.
    డీఎస్పీ పరిశీలన 
    ప్రమాదం విషయం తెలుసుకున్న డీఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి, సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ షరీఫ్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదంపై స్థానికులతో వివరాలు ఆరా తీశారు.
     
     

Advertisement
 
Advertisement
Advertisement