తీసుకున్న అప్పు తిరిగి చెల్లించమన్నందుకు ఓ వ్యక్తి అప్పు ఇచ్చిన వ్యక్తిని నరికేశాడు.
పాణ్యం(కర్నూలు జిల్లా): తీసుకున్న అప్పు తిరిగి చెల్లించమన్నందుకు ఓ వ్యక్తి అప్పు ఇచ్చిన వ్యక్తిని వేటకొడవలితో నరికేశాడు. ఈ సంఘటన పాణ్యం మండలం కౌలూరులో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.. కౌలూరు గ్రామానికి చెందిన యేసఫ్(55) అనే వ్యక్తి వద్ద అదే గ్రామానికి చెందిన చెట్ల గోపాల్ సుమారు రూ.6 లక్షల అప్పు తీసుకున్నాడు.
ఎప్పుడు అడిగినా తర్వాత ఇస్తా అని సమాధానం ఇవ్వడంతో కోర్టు ద్వారా నోటీసులు పంపించాడు. దీంతో కోపం పెంచుకున్న గోపాల్.. నాకే నోటీసులు పంపిస్తావా అని తనతో తెచ్చుకున్న వేటకొడవలితో యేసఫ్‌ను నరికి హత్యచేశాడు. ఘటన అనంతరం నిందితుడు గోపాల్ అక్కడినుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.