పట్టణంలోని కంచెరోని చెరువు సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. పట్టణ ఎస్సై సునీల్‌కుమార్ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
Aug 1 2016 12:07 AM | Updated on Sep 28 2018 3:41 PM
నిర్మల్ టౌన్ : పట్టణంలోని కంచెరోని చెరువు సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. పట్టణ ఎస్సై సునీల్‌కుమార్ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి చెందిన గౌతంరెడ్డి తన నలుగురు స్నేహితులతో కలిసి ఏపీ25ఎల్ 9009 నెంబర్ కారులో నిజామాబాద్ వైపు Ðð ళ్తున్నాడు. ఈ క్రమంలో నిజామాబాద్ వైపు నుంచి వేగంగా వస్తున్న లారీ కారును ఢీకొట్టింది. దీంతో కారును నడుపుతున్న గౌతంరెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. కారులో ఉన్న మిగతా వారు తీవ్ర గాయాలపాలు కాగా, వారిని మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Advertisement


