స్తంభాన్ని ఢీకొన్న బైక్
ఒకరి దుర్మరణం
సూళ్లూరుపేట : పట్టణంలోని చెంగాళమ్మ దక్షిణంవైపు ముఖద్వారంలో మధ్యలో ఉన్న స్తంభాన్ని ఢీకొని ఓ వ్యక్తి ఆదివారం అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కథనం మేరకు.. చిత్తూరు జిల్లా బుచ్చినాయుడుకండ్రిగ మండలం కాంపాళెంకు చెందిన అక్కరపాక మునిశేఖర్ (24) తడ మండలం మాంబట్టు సెజ్‌లోని రీజెన్ పవర్‌టెక్ కంపెనీలో పనిచేస్తున్నాడు. మాంబట్టులోనే అద్దెకు గది తీసుకుని ఉంటున్నాడు.
సూళ్లూరుపేట : పట్టణంలోని చెంగాళమ్మ దక్షిణంవైపు ముఖద్వారంలో మధ్యలో ఉన్న స్తంభాన్ని ఢీకొని ఓ వ్యక్తి ఆదివారం అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కథనం మేరకు.. చిత్తూరు జిల్లా బుచ్చినాయుడుకండ్రిగ మండలం కాంపాళెంకు చెందిన అక్కరపాక మునిశేఖర్ (24) తడ మండలం మాంబట్టు సెజ్‌లోని రీజెన్ పవర్‌టెక్ కంపెనీలో పనిచేస్తున్నాడు. మాంబట్టులోనే అద్దెకు గది తీసుకుని ఉంటున్నాడు. ఆదివారం మోటార్‌బైక్‌పై సూళ్లూరుపేటకు వచ్చాడు. తిరిగి వెళుతుండగా బైక్ అదుపు తప్పి చెంగాళమ్మ ఆలయం ముఖద్వారం ఆర్చి మధ్యలో ఉన్న స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో మునిశేఖర్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి మృతుని బంధువులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బంధువుల వద్ద ఫిర్యాదు తీసుకుని ఎస్‌ఐ జీ గంగాధర్‌రావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.