25న హాకీ బాలికల జూనియర్స్‌ ఎంపిక పోటీలు | On the selection of junior hockey for 25 matches | Sakshi
Sakshi News home page

25న హాకీ బాలికల జూనియర్స్‌ ఎంపిక పోటీలు

Aug 18 2016 12:17 AM | Updated on Sep 4 2017 9:41 AM

హాకీ జూనియర్స్‌ స్థాయి బాలికల ఎంపిక పోటీలను ఈనెల 25వ తేదీన హన్మకొండ‌లోని ఎన్‌యూసీ క్లబ్‌లో నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉస్మాన్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

వరంగల్‌ స్పోర్ట్స్‌ : హాకీ జూనియర్స్‌ స్థాయి బాలికల ఎంపిక పోటీలను ఈనెల 25వ తేదీన హన్మకొండ‌లోని ఎన్‌యూసీ క్లబ్‌లో నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉస్మాన్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన బాలికలు తెలంగాణ హాకీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 2 నుంచి 4 వరకు నల్లగొండలో జరిగే రాష్ట్రస్థాయి టోర్నమెంట్‌లో పాల్గొంటారని చెప్పారు. ఎంపిక పోటీల్లో పాల్గొనే వారు జనవరి 1, 1998 తర్వాత జన్మించి ఉండాలన్నారు. ఆసక్తి కలిగిన వారు 25న ఉదయం 8 గంటలకు పుట్టినతేదీ ధ్రువీకరణ పత్రాలను తీసుకుని హాకీ క్లబ్‌లో హాజరుకావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్‌ 90002–82185 నంబర్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement