రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలి మృతి | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలి మృతి

Published Tue, Jul 26 2016 11:57 PM

old age women died in accident

గీసుకొండ : మండలంలోని  వరంగల్‌ – నర్సంపేట రహదారిపై మంగళవారం రాత్రి కారు ఢీకొనడంతో ఓ వృద్ధురాలు మృతిచెందింది. ఈ సంఘటన దస్రుతండా వద్ద చోటుచేసుకుంది. నందనాయక్‌ తండా శివారు దస్రు తండాకు చెందిన మూడు జాంకీ(70), ఆమె భర్త దేస్లా, కోడలు వరంగల్‌కు వెళ్లి రాత్రి 7.40 గంటలకు  దస్రు తండా వద్ద బస్సు దిగారు. తండాలోకి వెళ్లడానికి రోడ్డు దాటుతుండగా నర్సంపేట వైపు నుంచి వరంగల్‌ వైపునకు వెళ్తున్న కారు జాంకీని ఢీకొట్టింది. దీంతో ఆమె ప్రాణాలు విడిచింది.  

Advertisement
 
Advertisement
 
Advertisement