కర్నూలుకు చెందిన యువతిపై బెంగళూరులోని ఓ న్యూమరాలజిస్ట్ అత్యాచార యత్నానికి ప్రయత్నించినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది.
మొదట్లో కొన్ని రోజులు బాగానే ఉన్నా శిక్షణ చివరి దశకు వచ్చిన సమయంలో గురూజీ ఆ యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె తప్పని వారించినా వినలేదు. ఆగస్టు 21న అత్యాచార యత్నం చేయగా, ఎలాగో తప్పించుకొన్న యువతి స్వస్థలానికి చేరుకుంది. మొదట్లో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి భయపడ్డ ఆ యువతి స్నేహితులు, బంధువుల సూచనల మేరకు శనివారం బెంగళూరుకు చేరుకొని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా శిక్షణ కోసం తన వద్ద రూ.1.50 లక్షలను తీసుకున్నాడని, ఆ సొమ్మును కూడా ఇప్పించాలని ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.