నాన్‌స్టాప్‌ బస్సులో పొగలు | non-stop bus in problem | Sakshi
Sakshi News home page

నాన్‌స్టాప్‌ బస్సులో పొగలు

Aug 21 2016 11:24 PM | Updated on Apr 7 2019 3:24 PM

రాజమహేంద్రవరం నుంచి కాకినాడకు ప్రయాణిస్తున్న నాన్‌స్టాప్‌ ఆర్టీసీ బస్సు నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు ప్రాణభయంతో పరుగులు తీసిన సంఘటన ఇది. జాతీయ రహదారిపై స్థానిక జీఎస్‌ఎల్‌ వైద్య కళాశాల సమీపంలో ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.

  • జీఎస్‌ఎల్‌ ఆస్పత్రి వద్ద సంఘటన
  • ప్రయాణికులు సురక్షితం
  • రాజానగరం : 
    రాజమహేంద్రవరం నుంచి కాకినాడకు ప్రయాణిస్తున్న నాన్‌స్టాప్‌ ఆర్టీసీ బస్సు నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు ప్రాణభయంతో పరుగులు తీసిన సంఘటన ఇది. జాతీయ రహదారిపై స్థానిక జీఎస్‌ఎల్‌ వైద్య కళాశాల సమీపంలో ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. కృష్ణా పుష్కరాలకు ఇక్కడి బస్సులను తరలించడంతో, రాజమహేంద్రవరం–కాకినాడ నాన్‌స్టాప్‌ సర్వీసును ప్రస్తుతం పాసింజర్‌ బస్సుతోనే నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం నుంచి బయలుదేరిన నాన్‌ స్టాప్‌ బస్సు జీఎస్‌ఎల్‌ కళాశాల సమీపంలోకి వచ్చేసరికి ఆకస్మికంగా పొగలు వెలువడ్డాయి. ఆ సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నారు. వారు కేకలు పెట్టడంతో బస్సును రోడ్డు పక్కన ఆపేశారు. స్థానికుల సహకారంతో ప్రయాణికులు మెయిన్‌ డోర్, కిటికీల నుంచి బయటపడ్డారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు. ఆర్టీసీ అధికారులు మరో బస్సును ఏర్పాటు చేసి ప్రయాణికులను పంపించారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement