ఆంధ్రప్రదేశ్ రాజధాని భూముల ఒప్పందాల్లో ఎటువంటి రహస్యాలు లేవని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు స్పష్టం చేశారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని భూముల ఒప్పందాల్లో ఎటువంటి రహస్యాలు లేవని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు స్పష్టం చేశారు. బుధవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. సింగపూర్ ప్రభుత్వానికి 58 శాతం వాటా ఇస్తున్నామని చెప్పారు. ఏపీ ప్రభుత్వానికి 42 శాతం వాటా ఉంటుందని అన్నారు. ఎకరం రూ. 4 కోట్లకు తగ్గకుండా అమ్ముతామని తెలిపారు.
భూముల ఒప్పందం ఏపీ ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వానికి మధ్య జరుగుతుందని చెప్పారు. ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందం చేసుకోమని బోండ ఉమ స్పష్టం చేశారు.