నిర్మల్ జిల్లా ఏర్పాటు విరమించుకోవాలి | No Nirmal separate district, says adilabad district parirakshana samithi | Sakshi
Sakshi News home page

నిర్మల్ జిల్లా ఏర్పాటు విరమించుకోవాలి

Aug 19 2016 12:30 PM | Updated on Aug 17 2018 2:56 PM

ఆదిలాబాద్ జిల్లాను రెండు జిల్లాలుగా మాత్రమే విభజించాలంటూ జిల్లా పరిరక్షణ సమితి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాను రెండు జిల్లాలుగా మాత్రమే విభజించాలంటూ జిల్లా పరిరక్షణ సమితి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. శుక్రవారం ఉదయం పట్టణానికి చేరుకున్న శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్‌ను జిల్లా పరిరక్షణ సమితి సభ్యులు ఘెరావ్ చేశారు. అనంతరం ఆయనకు పరిరక్షణ సమితి నాయకులు వినతి పత్రం సమర్పించారు.

ఆదిలాబాద్, మంచిర్యాలతోపాటు నిర్మల్‌ను కూడా జిల్లాగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని..అయితే నిర్మల్ జిల్లా ఏర్పాటు ప్రతిపాదనను విరమించేలా కేసీఆర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని వారు స్వామిగౌడ్ను కోరారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు. మీ అభ్యర్థనను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తానని ఆయన పరిరక్షణ సమితి సభ్యులకు హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement