రైతులు నిల్‌...అధికారులు ఫుల్‌ | no farmers in eruvaka program | Sakshi
Sakshi News home page

రైతులు నిల్‌...అధికారులు ఫుల్‌

Jun 9 2017 6:01 PM | Updated on Jun 4 2019 5:04 PM

రైతులు నిల్‌...అధికారులు ఫుల్‌ - Sakshi

రైతులు నిల్‌...అధికారులు ఫుల్‌

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏరువాక కార్యక్రమానికి రైతుల నుండి స్పందన నిల్‌గా మారింది

ఐదు మండలాల నుండి కేవలం పది మందిలోపే హాజరైన రైతులు
► అధికారుల పై అసంతృప్తి వ్యక్తం చేసిన టిడిపి నాయుకులు


కురుపాం: కురుపాం మండల కేంద్రంలోని శుక్రవారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏరువాక కార్యక్రమానికి రైతుల నుండి స్పందన నిల్‌గా మారింది.. సభా స్థలంలో ఐదు మండలాల నుండి వచ్చిన వ్యవసాయాధికారులు, ఏఈఓలు, హార్టీకల్చర్‌. తోపాటు టిడిపి నాయుకులే ఒకరి మొఖం ఒకరు చూసుకోవలసి వచ్చింది. వాస్తవానికి ఐదు మండలాల నుండి కూడా వందల సంఖ్యలో రైతులు వస్తారని ఉదయం 10 గంటల నుండి కూడా వ్యవసాయాధికారులు నిరీక్షించినా ఫలితం లేక పోవడంతో వచ్చిన పది మంది రైతుల తోనే ఎట్టకేలకు 12 గంటలకు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అయితే విషయం గమనించిన టిడిపి నాయుకులు వ్యవసాయాధికారుల పై అసంతృప్తి వ్యక్తం చేసారు నియోజకవర్గస్థాయి కార్యక్రమాన్ని ఇంత తక్కువ మంది రైతులతో నిర్వహించటం సరికాదని రైతుల కంటే అధికారులే ఎక్కువ మంది దర్శణమిస్తున్నారని ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇంత పేలవంగా నిర్వహించటం సరికాదని ఏడిఏ శంకరరావు పై అసంతృప్తి వ్యక్తం చేసారు, ఇక కార్యక్రమాన్ని తూతూ మంత్రంగా నిర్వహించి ముగించేసారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement