శవం ఖనానికి స్థలంలేక.. | No burial ground in huzurnagar | Sakshi
Sakshi News home page

శవం ఖనానికి స్థలంలేక..

Aug 14 2015 2:56 PM | Updated on Sep 3 2017 7:27 AM

శవాన్ని ఖననం చేయడానికి స్థలం లేకపోవడంతో ఏకంగా పంచాయతీ కార్యాలయం ఎదుటే శవంతో ధర్నాకు దిగారు.

నల్లగొండ : శవాన్ని ఖననం చేయడానికి స్థలం లేకపోవడంతో ఏకంగా పంచాయతీ కార్యాలయం ఎదుటే శవంతో ధర్నాకు దిగారు. ఈ సంఘటన శుక్రవారం నల్లగొండ జిల్లా హుజూరునగర్ నగర పంచాయతీ కార్యాలయం ఎదుట చోటు చేసుకుంది. పంచాయతీ పరిధిలోని వడ్డెర కులస్థులకు శవాలను ఖననం చేయడానికి స్థలం లేదు.

దీంతో గురువారం మృతి చెందిన ఒక వ్యక్తి మృతదేహంతో నగర పంచాయతీ కార్యాలయం ఎదుట అతడి బంధువులు బైఠాయించారు. దీంతో పంచాయతీ చైర్మన్ స్పందించి వడ్డెర సంఘం నాయకులతో చర్యలు జరుపుతున్నారు. ఈ సంఘటన జరిగిన హుజూరునగర్కు టీ పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement