18న కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ రాక | Nithin Gadkari arrived on 18 | Sakshi
Sakshi News home page

18న కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ రాక

Aug 17 2016 12:59 AM | Updated on Sep 4 2017 9:31 AM

18న కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ రాక

18న కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ రాక

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఈ నెల 18వ తేదీన నగరానికి రానున్నారని బీజేపీ నగర అధ్యక్షుడు ఎం. నాగేంద్ర తెలిపారు. నగర పార్టీ కార్యాలయంలో మంగళవారం బీజేపీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు.

బీచ్‌రోడ్‌ : కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఈ నెల 18వ తేదీన నగరానికి రానున్నారని బీజేపీ నగర అధ్యక్షుడు ఎం. నాగేంద్ర తెలిపారు. నగర పార్టీ కార్యాలయంలో మంగళవారం బీజేపీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 70వ స్వాతంత్య్రదిన వేడుకలను పురస్కరించుకుని బీజేపీ చేపట్టిన తిరంగ యాత్రలో పాల్గొనడానికి గడ్కరీ వస్తున్నారని, దీనికి నగర పార్టీ నాయకులంతా సిద్ధంగా ఉండాలని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్‌.వి.ఎస్‌.ప్రకాస్‌ రెడ్డి, నాని, గుండ రఘుబాబు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement