రాష్ట్రానికి పిడుగుపాటు హెచ్చరికలు.. పలు జిల్లాల్లో వర్షాలు | weather update in andhra pradesh | Sakshi
Sakshi News home page

రాష్ట్రానికి పిడుగుపాటు హెచ్చరికలు.. పలు జిల్లాల్లో వర్షాలు

Oct 17 2026 3:32 PM | Updated on Oct 17 2026 3:47 PM

weather update in andhra pradesh

సాక్షి,విశాఖ‌: రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాబోయే 3 గంటల్లో రాష్ట్రంలోని ప‌లు జిల్లాలో  ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ  హెచ్చరించింది. 

ఈ మేరకు అధికారికంగా ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, తిరుపతికి ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.

రంపచోడవరం, నర్సీపట్నం, కృష్ణదేవిపేట, రౌతులపూడి, మాడుగుల, ఓర్వకల్లు, వెల్దుర్తి, డోన్, గుత్తి, బద్వేలు, సత్యవేడు, శ్రీకాళహస్తి, పొదిలి, సూళ్లూరుపేట, నాయుడుపేట, గొట్టిప్రోలులో మోస్తరు వర్షాలు కుర‌వ‌నున్నాయి. వర్షంతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ఉరుములు, మెరుపులు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement