సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు దాష్టీకం ప్రదర్శించారు. వైఎస్సార్సీపీ నేతల వాహనాలు ధ్వంసం చేసిన పోలీసులు.. టీయర్ గ్యాస్ ప్రయోగించడంతో పాటు గాల్లోకి కాల్పులు జరిపారు. నామినేషన్ వేసేందుకు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు రాగా.. వారిని అడ్డుకున్నారు. ఎంపీ అవినాష్ సహా నేతలను పోలీసులు అడ్డుకున్నారు.
నామినేషన్ వేయకుండా కూటమి కుట్రలకు పాల్పడుతోంది. పోలీసులను అడ్డుపెట్టుకుని వైఎస్సార్సీపీ నేతలపై లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగాలకు దిగింది. పులివెందులలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సమయం ముగిసే వరకు నామినేషన్ సెంటర్లోకి వైఎస్సార్సీపీ అభ్యర్థులను పంపకుండా కుతంత్రాలు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలపైకి రాళ్లు రువ్వుతున్నారు పోలీసులు. మరొకవైపు ఏకే 47తో కాల్పులకు దిగారు పోలీసులు.

నామినేషన్ సెంటర్ దగ్గర టీడీపీ గూండాలు మోహరించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులపై దాడి చేసేందుకు టీడీపీ గూండాలు యత్నించారు. టీడీపీ గూండాలను మాత్రం అడ్డుకోని పోలీసులు.. వైఎస్సార్సీపీ నేతలు, కార్యర్తలపై ప్రతాపం చూపించారు. పోలీసుల దాష్టీకానికి నిరసనగా వైఎస్సార్సీపీ నేతలు ధర్నాకు దిగారు.
ఇదీ చదవండి: ఎంపీ చేతుల్లోంచి నామినేషన్ పేపర్లు లాక్కుని..




