తట్టుకు నూతన వ్యాక్సిన్‌ | New vaccine for measles | Sakshi
Sakshi News home page

తట్టుకు నూతన వ్యాక్సిన్‌

May 15 2017 11:14 PM | Updated on Sep 5 2017 11:13 AM

మీజిల్స్‌(తట్టు)కు కొత్త వ్యాక్సిన్‌ రాబోతోంది. ప్రస్తుతం ఇస్తున్న మీజిల్స్‌ టీకా వేసినా పిల్లలకు, పెద్దలకు తట్టు వస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు మీజిల్స్‌ రుబెల్లా వ్యాక్సిన్‌(ఎంఆర్‌) అనే కొత్త వ్యాక్సిన్‌ను తీసుకొస్తోంది.

కర్నూలు(హాస్పిటల్‌): మీజిల్స్‌(తట్టు)కు కొత్త వ్యాక్సిన్‌ రాబోతోంది. ప్రస్తుతం ఇస్తున్న మీజిల్స్‌ టీకా వేసినా పిల్లలకు, పెద్దలకు తట్టు వస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు మీజిల్స్‌ రుబెల్లా వ్యాక్సిన్‌(ఎంఆర్‌) అనే కొత్త వ్యాక్సిన్‌ను తీసుకొస్తోంది. దీనిని వచ్చే ఆగష్టు నుంచి పిల్లలకు వేస్తారని డిస్ట్రిక్ట్‌ ఇమ్యునైజేషన్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ వెంకటరమణ చెప్పారు. 9 నెలల వయసు నుంచి 15 ఏళ్ల వయసు వరకు ఈ వ్యాక్సిన్‌ను ఒక డోసు వేసుకోవచ్చన్నారు. ప్రతి నెలా నిర్ణీత తేదీల్లో జిల్లా వ్యాప్తంగా దీనిని పిల్లలకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా మొత్తంగా 7లక్షల వరకు 15 ఏళ్లలోపు పిల్లలుటార‍న్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement