నంద్యాల మీదుగా వెళ్లేందుకు నూతన రైళ్లకు రైల్వేబోర్డు నుంచి అనుమతి లభించిందని గుంటూరు డివిజన్ ఆర్‌యూసీసీ సభ్యులు ఊకొట్టు వాసు, కశెట్టి కృష్ణమూర్తి అన్నారు.
నంద్యాల మీదుగా నూతన రైళ్లకు అనుమతి
Sep 8 2016 10:10 PM | Updated on Sep 4 2017 12:41 PM
నూనెపల్లె: నంద్యాల మీదుగా వెళ్లేందుకు నూతన రైళ్లకు రైల్వేబోర్డు నుంచి అనుమతి లభించిందని గుంటూరు డివిజన్ ఆర్‌యూసీసీ సభ్యులు ఊకొట్టు వాసు, కశెట్టి కృష్ణమూర్తి అన్నారు. ఈ సందర్భంగా గురువారం వారు మాట్లాడుతూ గుంటూరు పట్టణంలో డీఆర్‌ఎం విజయశర్మ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో నూతన రైళ్లు, అభివృద్ధిపై చర్చించినట్లు తెలిపారు. గుంటూరు నుంచి నంద్యాల మీదుగా గుంతకల్‌కు డబ్లింగ్ లైన్ సర్వే పూర్తి చేశారని, పనులు చేసేందుకు రైల్వేబోర్డులో అనుమతి లభించిందన్నారు. గుంటూరు నుంచి నంద్యాల మీదుగా ముంబాయికి రెండు నెలల్లో కొత్త రైలు నడుస్తుందని చెప్పారు. విజయవాడ నుంచి కడపకు ఎర్రగుంట్ల మీదుగా వెళ్లేందుకు ఇంటర్ సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను నంద్యాలకు పొడిగించాలని కోరగా బోర్డు అనుమతి రావాల్సి ఉందన్నారు. అరక్కొణం నుంచి కడప వరకు వచ్చే రైలును నంద్యాల మరకు వరకు పొడిగించాలని కోరగా ఒప్పుకున్నారని చెప్పారు. గుంటూరు – నంద్యాల వరకు ఎలక్ట్రిఫికేషన్ లైన్ మార్చినాటికి పూర్తి చేస్తామన్నారు.
Advertisement
Advertisement