సాక్షి,నంద్యాల: తుపాకీ మిస్ ఫైర్ కావడంతో హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది.
డోన్ జీఆర్‌పీ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ పెద్దయ్య విధులు ముగించుకుని గన్ హ్యాండోవర్ చేసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో గన్ మిస్ ఫైర్ అయ్యాయింది. సమాచారం అందుకున్న రైల్వే ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు. కాగా,బాధితుడు హుబ్లీ నుంచి విజయవాడ వెళ్తున్న రైలులో విధులు నిర్వహించగా ..అతడిది సి. బెలగల్ గ్రామానికి చెందినట్లు సమాచారం.


