కర్నూలులో నీట్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలి | neet centre should arrange in kurnool | Sakshi
Sakshi News home page

కర్నూలులో నీట్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలి

Apr 12 2017 11:34 PM | Updated on Oct 20 2018 5:44 PM

కర్నూలులో నీట్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలి - Sakshi

కర్నూలులో నీట్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలి

కర్నూలులో నీట్‌ ( Neet) సెంటర్‌ ఏర్పాటు చేయాలని ఎంపీ బుట్టా రేణుక..బుధవారం పార్లమెంటులో ఇద్దరు మంత్రులను కలిసినట్లు ఎంపీ కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైంది.

– ఇద్దరు కేంద్ర మంత్రులను కలిసిన ఎంపీ బుట్టా రేణుక
కర్నూలు (ఓల్డ్‌సిటీ): కర్నూలులో నీట్‌ ( Neet) సెంటర్‌ ఏర్పాటు చేయాలని ఎంపీ బుట్టా రేణుక..బుధవారం పార్లమెంటులో ఇద్దరు మంత్రులను కలిసినట్లు ఎంపీ కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జె.పి.నడ్డా, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌లను వేర్వేరుగా కలిసి కర్నూలులో నీట్‌ ఆవశ్యకతను ఎంపీ వివరించారు. ఎంతోమంది నీట్‌కు సిద్ధమవుతున్నారని, ఇక్కడ పరీక్ష కేంధ్రఃలేనందున అవస్థలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఏపీలో నాలుగు చోట్ల మాత్రమే కేంద్రాలు ఏర్పాటు చేశారని, ఇవి కర్నూలు నియోజకవర్గం నుంచి సుమారు 300 నుంచి 400 కి.మీ. దూరంలో ఉన్నాయని, విద్యార్థులు అక్కడికి చేరుకోవడానికే 6 నుంచి 8 గంటల సమయం పడుతుందని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement