పోలీసుల అదుపులో నయీమ్ అత్త | Nayim's Mother in low is in police custody | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో నయీమ్ అత్త

Aug 8 2016 5:40 PM | Updated on Aug 29 2018 4:18 PM

గ్యాంగ్‌స్టర్ నయీమ్ అత్త ను నల్లగొండ జిల్లా మిర్యాల గూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

- మిర్యాలగూడలో సోదాలు
మిర్యాలగూడ (నల్గొండ జిల్లా)

 గ్యాంగ్‌స్టర్ నయీమ్ అత్త, బామ్మర్ది మిర్యాలగూడలో నివాసం ఉంటున్నారు. నయీమ్ ఎన్‌కౌంటర్ సంఘటన తర్వాత సోమవారం పోలీసులు మిర్యాలగూడ ప్రకాశ్‌నగర్, హౌసింగ్‌బోర్డులోని నయీమ్ అత్త, బామ్మర్ది నివాసం ఉంటున్న ఇళ్లలో సోదాలు నిర్వహించారు. నయీమ్ అత్త, బామ్మర్ది, అతని భార్యను అదుపులోకి తీసుకుని స్థానిక రెండవ పోలీసు స్టేషన్‌కు తరలించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement