వలిగొండ : గాంగ్‌స్టార్ నయీం అనుచరులైన మండల కేంద్రానికి చెందిన ముగ్గురిని మంగళవారం సిట్ అధికారులు విచారించినట్టు సమాచారం.l
వలిగొండ : గాంగ్‌స్టార్ నయీం అనుచరులైన మండల కేంద్రానికి చెందిన ముగ్గురిని మంగళవారం సిట్ అధికారులు విచారించినట్టు సమాచారం.lవలిగొండకు చెందిన కొనపూరి శంకర్, కొనపూరి శ్రీశైలం, గుండు వెంకటేశంల వద్ద మారణాయుధాలు లభించడంతో కొన్ని రోజుల క్రితం పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అయితే వారిని విచారణ నిమిత్తం సిట్ అధికారులు కోర్టు ద్వారా మూడు రోజుల కస్టడీకి తీసుకున్నట్లు సమాచారం. వారిని మండలకేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో సిట్ అధికారులు, రామన్నపేట సీఐ శ్రీధర్, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు విచారించినట్లు తెలిసింది. మరో రెండు రోజులపాటు విచారణ చేయనున్నట్లు సమాచారం.