జాతీయ లోక్‌అదాలత్‌ను విజయవంతం చేయండి | National Lok adalat on 12th | Sakshi
Sakshi News home page

జాతీయ లోక్‌అదాలత్‌ను విజయవంతం చేయండి

Nov 4 2016 10:55 PM | Updated on Sep 4 2017 7:11 PM

జాతీయ లోక్‌అదాలత్‌ను విజయవంతం చేయండి

జాతీయ లోక్‌అదాలత్‌ను విజయవంతం చేయండి

గూడూరు : ఈ నెల 12వ తేదీ శనివారం జరగనున్న జాతీయ లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేసే దిశగా అందరూ కృషి చేయాలని 7వ అదనపు జిల్లా జడ్జి గురప్ప అన్నారు.

గూడూరు : ఈ నెల 12వ తేదీ శనివారం జరగనున్న జాతీయ లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేసే దిశగా అందరూ కృషి చేయాలని 7వ అదనపు జిల్లా జడ్జి గురప్ప అన్నారు. ఈ మేరకు స్థానిక కోర్టులో శుక్రవారం సాయంత్రం ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి దివాకర్, అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కేపీ సాయిరాంలతోపాటు గూడూరు, ఆత్మకూరు డీఎస్పీలు శ్రీనివాస్, సుబ్బారెడ్డిలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి లోక్‌ అదాలత్‌లో కేసుల పరిష్కారంలో జిల్లాలోనే గూడూరు ప్రథమ స్థానంలో ఉందన్నారు. గతంలో జరిగిన జాతీయ లోక్‌ అదాలత్‌లో 138 కేసులు పరిష్కరించడం జరిగిందన్నారు. ఈ దఫా జరుగబోయే అదాలత్‌లో 400 కేసుల వరకు పరిష్కరించే దిశగా ప్రయత్నించాలన్నారు. దీని కోసం ఒక టీంలా ఏర్పడి కృషి చేయాలన్నారు. ఇలా లోక్‌ అదాలత్‌లో కేసులు పరిష్కరించుకోవడం ద్వారా కక్షిదారులకు సమయం వృథా కాదన్నారు. అలాగే ప్రభుత్వ ధనం కూడా వృథా కాదన్నారు.  
 
 

Advertisement
 
Advertisement
Advertisement