అనంతమైన వింతలపుంత విశ్వాంతరాళం | nasa yatra team | Sakshi
Sakshi News home page

అనంతమైన వింతలపుంత విశ్వాంతరాళం

Dec 16 2016 10:29 PM | Updated on Nov 9 2018 4:36 PM

విశ్వంలో అంతులేనన్ని అద్భుతాలున్నాయని అమెరికాలోని అంతరిక్ష సంస్థ ‘నాసా’ 2020లో చేపట్టే అంగారకయాత్ర బృందం సభ్యులు జస్లి¯ŒS జోష¯ŒS అన్నారు. అంతరిక్షం, నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాల వంటి వాటిపై విద్యార్థి దశ నుంచే అవగాహన, ఆసక్తి

  • విద్యార్థి దశ నుంచే అవగాహన పెంచుకోవాలి 
  • ‘నాసా’ అంగారక యాత్రా బృందం సభ్యురాలు జస్లి¯ŒS 
  • భానుగుడి(కాకినాడ):
    విశ్వంలో అంతులేనన్ని అద్భుతాలున్నాయని అమెరికాలోని అంతరిక్ష సంస్థ ‘నాసా’ 2020లో చేపట్టే అంగారకయాత్ర బృందం సభ్యులు జస్లి¯ŒS జోష¯ŒS అన్నారు. అంతరిక్షం, నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాల వంటి వాటిపై విద్యార్థి దశ నుంచే అవగాహన, ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. అంగారకయాత్రకు ‘నాసా’ ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షలో 6,100 మంది పాల్గొనగా ఎంపికైన 8 మందిలో హర్యానాలోని కురుక్షేత్రకు చెందిన జస్లి¯ŒS ఒకరు. ఇంజినీరింగ్‌ పట్టభద్రురాలైన ఆమె ప్రస్తుతం యాత్ర నిమిత్తం ‘నాసా’ శిక్షణ పొందుతున్నారు. అంగారక గ్రహంపై శుక్రవారం ఆశ్రమ్‌ పబ్లిక్‌స్కూల్‌ విద్యార్థులకు జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ తాను రోదసీ యాత్రికురాలు కల్పనా చావ్లా స్ఫూర్తితో ఈ స్థాయికి  చేరానన్నారు. తాను ఏవిధంగా నాసాకు ఎంపికయినదీ వివరించారు. విద్యార్థి దశలోనే ఎవరో ఒకరిని స్ఫూర్తిగా తీసుకుని,  లక్ష్య సాధనకు అవిశ్రాంతంగా కృషి చేయాలన్నారు.
    అంగారక గ్రహం, అంతరిక్షంపై విద్యార్థుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. సై¯Œ్స పట్ల విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు దేశ వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు జస్లి¯ŒS తెలిపారు. కల్పనా చావ్లా లాంటి వారిని దేశానికి అందివ్వడమే  తన లక్ష్యమన్నారు. అంతరిక్ష యాత్ర చేయాలన్న చిన్ననాటి కోరిక త్వరలో నెరవేరబోతున్నందున  ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమ రీజినల్‌ కో ఆర్డినేటర్, అంతరిక్ష పరిశోధనా విద్యార్థి దీపికా దవులూరి మాట్లాడుతూ త్వరలో రోదసీలోకి అడుగుపెట్టబోతున్న వ్యక్తిని కాకినాడ నగరానికి  పరిచయం చేయడం ఆనందంగా ఉందన్నారు. టెక్‌మంత్రా ల్యాబ్స్‌ నవ్‌దీప్‌ విష్ణువాన్సీ, ఆశ్రమ్‌ పాఠశాల కరస్పాండెంట్‌ డీవీ కృష్ణంరాజు, డైరెక్టర్‌ రామచంద్రరావు, ప్రిన్సిపాల్‌ అగస్టీ, అడ్మినిస్ట్రేష¯ŒS ప్రతినిధి ఎలిజా, దవులూరి రాంబాబు, జేడీ పవ¯ŒS  పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement