‘నమో వెంకటేశ’ పేరు మార్చాలి | namo venkatesha nam should change | Sakshi
Sakshi News home page

‘నమో వెంకటేశ’ పేరు మార్చాలి

Jan 22 2017 11:15 PM | Updated on Aug 9 2018 7:28 PM

‘నమో వెంకటేశ’ పేరు మార్చాలి - Sakshi

‘నమో వెంకటేశ’ పేరు మార్చాలి

గిరిజనుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న రాఘవేంద్రరావు సినిమా ‘నమో వెంకటేశా’ పేరు మార్చాలని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.కైలాష్‌ నాయక్‌ డిమాండ్‌ చేశారు.

-లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడి డిమాండ్‌ 
- లేనిపక్షంలో దేశవ్యాప్త ఉద్యమానికి సిద్ధపడతామని హెచ్చరిక 
 
కర్నూలు (సీక్యాంప్‌): గిరిజనుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న రాఘవేంద్రరావు సినిమా ‘నమో వెంకటేశా’ పేరు మార్చాలని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.కైలాష్‌ నాయక్‌ డిమాండ్‌ చేశారు. నగరశివారు సుగాలితండాలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 12కోట్ల మంది బంజారా జాతి గురువు హథీరాంబావాను కించపరిచేలా సినిమా సన్నివేశాలున్నాయన్నారు. అన్నమయ్య, శ్రీరామదాసు తరహాలో నమో వెంకటేశను కూడా హథీరాంబావా గురించి తీయాలన్నారు. విషయంపై చిత్ర దర్శకుడు రాఘవేంద్రరావును కలుస్తామని, ఆయన అంగీకరించకపోతే సినిమా విడుదలను అడ్డుకుంటామన్నారు. కార్యక్రమంలో సమితి నాయకులు శంకర్‌ నాయక్, గుండాల్‌నాయక్, యోగేష్‌నాయక్, శీతారాంనాయక్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement