హోటళ్లలో మున్సిపల్ అధికారుల తనిఖీలు
హుజూర్‌నగర్ : పట్టణంలో హోటళ్ల నిర్వాహకులు శుచి, శుభ్రతకు ప్రాధాన్యతనివ్వాలని నగరపంచాయితీ కమిషనర్ బైరెడ్డి సత్యనారాయణరెడ్డి అన్నారు.
హుజూర్‌నగర్ : పట్టణంలో హోటళ్ల నిర్వాహకులు శుచి, శుభ్రతకు ప్రాధాన్యతనివ్వాలని నగరపంచాయితీ కమిషనర్ బైరెడ్డి సత్యనారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని పలు హోటళ్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆహార పదార్థాలను ఏరోజు కారోజు మాత్రమే వినియోగదారులకు సరఫరా చేయాలని, నిల్వ ఉన్న ఆహార పదార్థాల విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. హోటళ్లలో వంట గదుల నుంచి పదార్థాల తయారీ, విక్రయాలన్నీ నిబంధనల మేరకు ఉండాలని, లేకపోతే సంబంధిత యజమానులకు జరిమానాలు విధించడంతో పాటు కేసులు నమోదు చేయడం జరుగు తుందన్నారు. పట్టణంలో నిబంధనలు పాటించని పలు హోటళ్ల యజమానులకు రూ.14,500లు జరిమానా విధించినట్లు తెలిపారు. అదే విధంగా పట్టణంలో ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని పూర్తిగా నిషే«ధించడం జరిగిందని, అందుకు విరుద్దంగా వ్యవహరించిన వ్యాపారులకు రూ. 5 వేల జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఏఈలు టి.ప్రవీణ్, వినోద్, సిబ్బంది ఉన్నారు.