ఏడు పాటలకు రూ. ఏడు లక్షలు కొట్టేసింది! | mumaith khan hulchul in vizianagaram district | Sakshi
Sakshi News home page

ఏడు పాటలకు రూ. ఏడు లక్షలు కొట్టేసింది!

May 25 2016 11:23 PM | Updated on Aug 28 2018 4:30 PM

ఏడు పాటలకు రూ. ఏడు లక్షలు కొట్టేసింది! - Sakshi

ఏడు పాటలకు రూ. ఏడు లక్షలు కొట్టేసింది!

ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే అంటూ పోకిరి సినిమాలో ముమైత్ ఖాన్ సెప్టులేసి... ప్రేక్షకులతోపాటు కుర్రకారును మైమరిపించింది.

విజయనగరం : ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే అంటూ పోకిరి సినిమాలో ముమైత్ ఖాన్ సెప్టులేసి... ప్రేక్షకులతోపాటు కుర్రకారును మైమరిపించింది. ఆ సినిమాలో ఆ పాటకు డ్యాన్స్ వేసి ఆ చిత్ర నిర్మాతల నుంచి ఎంత పారితోషకం తీసుకుందో తెలియదు కానీ... విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం చిప్పాడ గ్రామంలో ఏర్పాటు చేసిన స్టేజ్పై ఏడు పాటలకు ముమైత్ ఖాన్ డ్యాన్స్ చేసి... ఏకంగా ఒక్కో పాటకు రూ. లక్ష చొప్పున ఏడు పాటలకు రూ. 7 లక్షలు నిర్వాహాకుల నుంచి పారితోషకం తీసుకున్నట్లు సమాచారం.

బుధవారం చిప్పాడ గ్రామంలో కొలువైన శ్రీ సుత్తమ్మ తల్లి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానికంగా ప్రోగ్రాం నిర్వాహాకులు ఏర్పాటు చేశారు. అందులోభాగంగా ముమైత్ ఖాన్ డాన్స్ ప్రోగ్రాం చూడటానికి పలు గ్రామాల నుంచి పెద్ద  సంఖ్యలో ప్రజలు చిప్పాడ చేరుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement