మునికోటి కుటుంబానికి పవన్‌ కల్యాణ్‌ రూ.2 లక్షల సాయం | mukkoti, donetion, pavankalyan | Sakshi
Sakshi News home page

మునికోటి కుటుంబానికి పవన్‌ కల్యాణ్‌ రూ.2 లక్షల సాయం

Aug 9 2016 11:15 PM | Updated on Mar 22 2019 5:29 PM

మునికోటి భార్య,సోదరుడికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందజేసిన పవన్‌ కల్యాణ్‌ ప్రతినిధి రాఘవయ్య - Sakshi

మునికోటి భార్య,సోదరుడికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందజేసిన పవన్‌ కల్యాణ్‌ ప్రతినిధి రాఘవయ్య

ప్రత్యేక హోదా కోసం ప్రాణత్యాగం చేసిన మునికోటి కుటుంబానికి జనసేన అధినేత, హీరో పవన్‌కల్యాణ్‌ రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించారు.

సాక్షి ప్రతినిధి, తిరుపతి :  ప్రత్యేక హోదా కోసం ప్రాణత్యాగం చేసిన మునికోటి కుటుంబానికి జనసేన అధినేత, హీరో పవన్‌కల్యాణ్‌ రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించారు. మంగళవారం మధ్యాహ్నం పవన్‌ కల్యాణ్‌ తరపున ఆయన ప్రతినిధి మారిశెట్టి రాఘవయ్య తిరుపతి వచ్చి సాయాన్ని అందజేశారు. రాఘవయ్య వెంట జిల్లా జనసేన నాయకులు, తిరుపతి అభిమాన సంఘం నాయకులు కిరణ్‌రాయల్, రాజారెడ్డి, దినేష్‌జైన్, హరిశంకర్‌లు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement