బాబు మాటలకు చప్పట్లు కొట్టడం తెలుసా? | mp siva prasad takes on tdp sc leaders in chittoor | Sakshi
Sakshi News home page

బాబు మాటలకు చప్పట్లు కొట్టడం తెలుసా?

May 18 2016 8:30 PM | Updated on Aug 11 2018 4:03 PM

బాబు మాటలకు చప్పట్లు కొట్టడం తెలుసా? - Sakshi

బాబు మాటలకు చప్పట్లు కొట్టడం తెలుసా?

'పార్టీలో పని చేస్తున్న ప్రతి ఎస్సీ నాయకుడికీ, కార్యకర్తకు పదవులు మేం ఇవ్వలేం.. మీరు ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబును అడగండి' అంటూ చిత్తూరు ఎంపీ శివప్రసాద్ టీడీపీ ఎస్సీ నాయకులు, కార్యకర్తలకు షాక్ ఇచ్చారు.

చిత్తూరు గ్రామీణం : 'పార్టీలో పని చేస్తున్న ప్రతి ఎస్సీ నాయకుడికీ, కార్యకర్తకు పదవులు మేం ఇవ్వలేం.. మీరు ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబును అడగండి' అంటూ చిత్తూరు ఎంపీ శివప్రసాద్ టీడీపీ ఎస్సీ నాయకులు, కార్యకర్తలకు షాక్ ఇచ్చారు. బుధవారం చిత్తూరు నగరంలోని బాలాత్రిపుర సుందరి కల్యాణ మండపంలో టీడీపీ నియోజకవర్గ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ శివప్రసాద్ తోపాటు జెడ్పీ చైర్‌పర్సన్ గీర్వాణి, ఎమ్మెల్యే సత్యప్రభ, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తమకు పదవులు ఇవ్వాలని కొందరు ఎస్సీ నాయకులు  శివ ప్రసాద్ను డిమాండ్ చేశారు. దీంతో ఆగ్రహించిన ఎంపీ శివప్రసాద్ మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చినప్పుడు పదవులు అడగవచ్చు కదా.... చంద్రబాబు వచ్చినప్పుడు ఆయన మాటలకు చప్పట్లు కొట్టడం మాత్రమే తెలుసా..? ఆయన్ని ఎందుకు ప్రశ్నించరు... మమ్మల్ని ఎందుకు నిలదీస్తున్నారు... పదవులు ఇవ్వడం మా వల్ల కాదు, ఇవ్వడం కుదరదండి.. మీరే వెళ్లి సీఎంను అడగండి అంటూ ఎంపీ.. ఎస్సీ నాయకులు, కార్యకర్తలకు తేల్చి చెప్పేశారు. రాష్ట్ర పరిస్థితులను అర్థం చేసుకోవాలని నాయకులను ఈ సందర్భంగా శివప్రసాద్ కోరారు. దీంతో ఆ పార్టీ ఎస్సీ నాయకులు శివప్రసాద్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరిన్ని ప్రశ్నలు అడిగే సరికి వద్దు అంటూ దండం పెట్టి అక్కడ నుంచి శివప్రసాద్ వెళ్లిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement