దేశ్‌ముఖిలో సినిమా షూటింగ్‌ | movie shooting in deshmukhi | Sakshi
Sakshi News home page

దేశ్‌ముఖిలో సినిమా షూటింగ్‌

Aug 29 2016 8:42 PM | Updated on Aug 9 2018 7:28 PM

దేశ్‌ముఖిలో సినిమా షూటింగ్‌ - Sakshi

దేశ్‌ముఖిలో సినిమా షూటింగ్‌

భూదాన్‌పోచంపల్లి: మండలంలోని దేశ్‌ముఖి సెయింట్‌ మేరీస్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో సోమవారం శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న సినిమా షూటింగ్‌ జరిగింది.

భూదాన్‌పోచంపల్లి: మండలంలోని దేశ్‌ముఖి సెయింట్‌ మేరీస్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో సోమవారం శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న సినిమా షూటింగ్‌ జరిగింది. హీరో నవీన్‌చంద్ర, హీరోయిన్‌ స్మృతి (పటాస్‌ ఫేం)లపై పలు సన్నివేశాలను చిత్రీకరించారు. అలాగే హీరోయిన్‌ తన ఫ్రెండ్స్‌తో కలిసి ఐస్‌క్రీమ్‌ తింటున్న సన్నివేశాలతో పాటు హాస్య నటులు ధన్‌రాజ్, అవినాష్‌లపై పలు సన్నివేశాలను తెరకెక్కించారు. ఈ సందర్భంగా దర్శకుడు సత్తిబాబు మాట్లాడుతూ యువతకు సందేశంతో కామెడీ ఓరియెంటెడ్‌తో చిత్రాన్ని నిర్మిస్తున్నామని, ఈ చిత్రానికి ఇంకా పేరు పెట్టలేదని తెలిపారు. కెమెరామెన్‌గా బాల్‌రెడ్డి, సంగీతం శ్రీవసంత్, నిర్మాత కేకే. రాధామోహన్‌ వహిస్తున్నారని తెలిపారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement