అమ్మే.. అమ్మేసింది..! | mother sold daughter, several arrested in prakasam district | Sakshi
Sakshi News home page

అమ్మే.. అమ్మేసింది..!

Jun 13 2016 8:15 AM | Updated on Aug 30 2018 4:07 PM

అమ్మే.. అమ్మేసింది..! - Sakshi

అమ్మే.. అమ్మేసింది..!

కన్నతల్లే కర్కశంగా ప్రవర్తించిన ఘటన ఇది.. అమ్మే అమ్మేసింది.. మానవ సంబంధాలు రక్త మాంసాల వ్యాపారం అయ్యాయి.

*చిన్నారిని చెరబట్టిన కామాంధులు.. పలుమార్లు లైంగికదాడి!
*ఆటో ప్రమాదంతో వెలుగుచూసిన అకృత్యాలు
*పోలీసుల అదుపులో ముగ్గురు.. నిందితుల్లో హోంగార్డు


చీరాల (ప్రకాశం): కన్నతల్లే కర్కశంగా ప్రవర్తించిన ఘటన ఇది.. అమ్మే అమ్మేసింది.. మానవ సంబంధాలు రక్త మాంసాల వ్యాపారం అయ్యా యి. చిన్నారిని ఒకరి తర్వాత మరొకరు అమ్ముకున్నారు. అభం శుభం తెలియని బాలిక అంగడి బొమ్మగా మారింది. గతవారం చీరాల పోలీసుల చెంతకు చేరిన పదకొండేళ్ల బాలికను విచారించగా గగుర్పొడిచే విషయాలు బయటపడ్డాయి.

హైదరాబాద్‌ బాలాజీనగర్‌కు చెందిన   దంపతులకు కుమార్తె ఉంది. భర్త ఆటో డ్రైవర్‌గా పని చేస్తుండేవాడు. భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో ఆమె భర్తను వదిలి మరో వ్యక్తితో సహజీవనం చేస్తోంది. కుమార్తె తల్లితోనే ఉంటోంది. అయితే తల్లి ప్రియుడు  బాలికపై కన్నేశాడు.  బాలికపై పలుమార్లు లైంగికదాడికి యత్నించాడు. ఈ విషయం బాలిక తల్లికి చెప్పినా.. కన్నకూతురినే కసురుకుంది. విషయం ‘ఎవరికైనా చెబితే చంపుతానని’ బెదిరించింది.

కాళ్లు పట్టుకున్నా కనికరించని కామాంధులు..
ఇంతటితో ఆగని తల్లి.. కన్నకూతురిని విజయవాడలోని ఓ మహిళకు అమ్మేసింది.  అక్కడి నుంచి మూణ్నెల్ల్ల క్రితం మంగళగిరికి చెందిన మరో మహిళకు విక్రయించింది. కొద్దిరోజుల తర్వాత మంగళగిరికి చెందిన మహిళ చీరాల బోడిపాలేనికి చెందిన ప్రస్తుతం దేవాంగపురి గుమస్తాల కాలనీలో ఉంటూ వ్యభిచారం నిర్వహిస్తున్న వాణికి అమ్మేసింది. అయితే, వాణి ప్రియుడు జితిన్‌లాల్‌ కూడా మృగంగా మారి బాలికపై పలుమార్లు లైంగికదాడికి ఒడిగట్టాడు. అలాగే ఆ ఇంటికి తరచూ వెళ్లే చీరాల వన్‌టౌన్‌ పోలీస్‌స్టేçÙన్‌ హోంగార్డు కూడా బాలికను చెరబట్టి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తనను వదిలేయాలని కాళ్లు పట్టుకున్నా ఆ చిన్నారిని కామాంధులు కనికరించలేదు.

ఆటో ప్రమాదంతో గుట్టు రట్టు..
వాణి ఆ బాలికను గుంటూరులో గుడికి వెళ్దామని తీసుకెళ్లి తిరిగి వస్తుండగా ఆటో ప్రమాదం చోటుచేసుకుంది. వాణికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇదే సమయంలో బాలిక గత సోమవారం అక్కడి నుంచి తప్పించుకుని కారంచేడు చేరుకుంది. ఒంటరిగా దిగాలుగా నడుచుకుంటూ వెళ్తున్న బాలికను.. గ్రామంలో మంచాలు విక్రయిస్తున్న చిలకలూరిపేటకు చెందిన అబ్దుల్‌బాషా అనే యువకుడు గమనించాడు. బాలిక వద్ద వివరాలు సేకరించి ఆమెను తన స్వగ్రామమైన చిలకలూరిపేట తీసుకెళ్లి స్నేహితుల సహాయంతో చిలకలూరిపేట పోలీసుల వద్దకు చేర్చాడు. అయితే అక్కడి పోలీసులు చీరాల స్టేషన్‌కు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో యువకులు బాలికను గత మంగళవారం చీరాల వన్‌టౌన్‌ స్టేషన్‌కు తీసుకొచ్చారు.

పోలీసులు చీరాల అర్బన్‌ సీడీపీవో నాగమణికి బాలికను అప్పగించారు. సీడీపీవో దగ్గరికి వెళ్లిన బాలిక తనపై జరిగిన దారుణాలను చెప్పుకుని కన్నీటి పర్యంతమైంది. దీనిపై సీడీపీవో నాగమణి లిఖిత పూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి వరకు అనాథ బాలికగా భావించిన పోలీసులు విచారణ చేస్తే జరిగిన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఘటనలో హోంగార్డుతోపాటు వాణి ప్రియుడు జితిన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలికను చీరాల ఏరియా ఆస్పత్రికి తరలించి వైద్యపరీక్షలు నిర్వహించారు. హైదరాబాద్‌లో ఉన్న బాలిక తల్లి , ఆమె ప్రియుడు , విజయవాడ, మంగళగిరికి చెందిన మహిళలతోపాటు, చీరాలలో వ్యభిచారం చేస్తున్న వాణి, ఆమె ప్రియుడు జితిన్, హోంగార్డుపై కేసు నమోదు చేసి సీఐ సత్యనారాయణ దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement