రేపు జిల్లాకు రానున్న సీఎం | monday cm comming | Sakshi
Sakshi News home page

రేపు జిల్లాకు రానున్న సీఎం

Sep 17 2016 11:12 PM | Updated on Sep 4 2017 1:53 PM

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం జిల్లా పర్యటనకు రానున్నారు. మధ్యాహ్నం 2:15 గంటలకు గన్నవరం నుంచి బయలుదేరి 2:50 గంటలకు మధురపూడి విమానాశ్రయానికి చేరుకుంటారు. రూ.200 కోట్లతో చేపట్టే విమానాశ్రయ విస్తరణపనులకు భూమి పూజ చేస్తారు.

  • రాజమహేంద్రవరం విమానాశ్రయ విస్తరణకు భూమి పూజ
  • సాక్షి, రాజమహేంద్రవరం :
    ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం జిల్లా పర్యటనకు రానున్నారు. మధ్యాహ్నం 2:15 గంటలకు గన్నవరం నుంచి బయలుదేరి 2:50 గంటలకు మధురపూడి విమానాశ్రయానికి చేరుకుంటారు. రూ.200 కోట్లతో చేపట్టే విమానాశ్రయ విస్తరణపనులకు భూమి పూజ చేస్తారు. అనంతరం రాష్ట్రంలోని విమానాశ్రయాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా మధ్య చర్చలు జరగనున్నాయి. అనంతరం అవగాహన ఒప్పందం కుదరనుంది. తిరిగి సాయంత్రం 5:15 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుంటారని సమాచార పౌర సంబంధాల శాఖ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. 
     

Advertisement
 
Advertisement
Advertisement