ఏఎస్ఐ మోహన్ రెడ్డికి బెయిల్ తిరస్కరణ | mohan reddy bail petition rejected in karimnagar court | Sakshi
Sakshi News home page

ఏఎస్ఐ మోహన్ రెడ్డికి బెయిల్ తిరస్కరణ

Nov 17 2015 1:56 PM | Updated on Aug 20 2018 5:11 PM

ఏఎస్ఐ మోహన్ రెడ్డికి కరీంనగర్ జిల్లా కోర్టులో చుక్కెదురైంది.

కరీంనగర్ : ఏఎస్ఐ మోహన్ రెడ్డికి కరీంనగర్ జిల్లా కోర్టులో చుక్కెదురైంది. బెయిల్ కావాలంటూ ఏఎస్సై దాఖలు చేసుకున్న పిటిషన్ను విచారణ చేసిన అనంతరం కరీంనగర్ జిల్లా కోర్టు తిరస్కరించింది. బెయిల్ మంజూరు చేస్తే మోహన్ రెడ్డి కేసు దర్యాప్తుపై ప్రభావం చూపుతుందని సీఐడీ అధికారులు కోర్టుకు వివరించారు.

వడ్డీ వ్యాపారిగా మారి సామాన్యులపై బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఏఎస్సై ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి పలువురు పోలీసు అధికారులపై బదిలీ వేటు పడింది. ఏఎస్సై మోహన్ రెడ్డి ముఖ్య అనుచరులు పరశురాం గౌడ్, పంకజ్ సింగ్, జ్ఞానేశ్వర్ల కోసం సీఐడీ బృందాలు గాలిస్తున్నాయి. సీఐడీ ఈ కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేస్తున్నట్లు కనిపిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement