జిల్లాలో ఓ మోస్తరుగా వర్షాలు | Moderate rain in the district | Sakshi
Sakshi News home page

జిల్లాలో ఓ మోస్తరుగా వర్షాలు

Sep 12 2016 10:19 PM | Updated on Sep 4 2017 1:13 PM

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి కారణంగా జిల్లాలోని వివిధ మండలాల్లో సోమవారం ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. జిల్లా మొత్తం మీద 119.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, జిల్లా సగటు 2.3 మిల్లీమీటర్లుగా నమోదైంది.

కడప సెవెన్‌రోడ్స్‌ : బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి కారణంగా జిల్లాలోని వివిధ మండలాల్లో సోమవారం ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. జిల్లా మొత్తం మీద 119.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, జిల్లా సగటు 2.3 మిల్లీమీటర్లుగా నమోదైంది. జిల్లాలో అత్యధికంగా పెండ్లిమర్రి మండలంలో 19.6 మిల్లీమీటర్లు కురిసింది. వివిధ మండలాలను పరిశీలిస్తే కడపలో 2.8, వల్లూరు 4.2, సీకే దిన్నె 5.2, చెన్నూరు 2.8, ఖాజీపేట 2.0, కమలాపురం 16.8, ఎర్రగుంట్ల 10.0, సంబేపల్లె 3.0, లక్కిరెడ్డిపల్లె 2.0, చక్రాయపేట 1.4, రామాపురం 10.0, గాలివీడు 1.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జమ్మలమడుగులో 5.2, మైలవరం 11.4, పెద్దముడియం 2.2, ముద్దనూరు 5.2, కొండాపురం 1.6, ప్రొద్దుటూరు 1.2, చాపాడు 2.0, వేంపల్లె 4.2, తొండూరు 3.4, సింహాద్రిపురంలో 2.2  మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. రాజంపేట రెవెన్యూ డివిజన్‌లో ఎక్కడా వర్షం కురవలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement