ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ తేదీ మార్పు | mlc election counting date change | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ తేదీ మార్పు

Feb 26 2017 12:00 AM | Updated on Oct 8 2018 7:35 PM

పశ్చిమ రాయలసీమ (వైఎస్‌ఆర్, అనంతపురం, కర్నూలు జిల్లాలు) పట్టభద్ర, ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ (ఓట్ల లెక్కింపు)తేదీని మార్చి 20వ తేదీకి ఎన్నికల కమిషన్‌ మార్పు చేసింది.

అనంతపురం అర్బన్‌ : పశ్చిమ రాయలసీమ (వైఎస్‌ఆర్, అనంతపురం, కర్నూలు జిల్లాలు) పట్టభద్ర, ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ (ఓట్ల లెక్కింపు)తేదీని మార్చి 20వ తేదీకి ఎన్నికల కమిషన్‌ మార్పు చేసింది. ఈ మేరకు ఈ నెల 23న ముఖ్య కార్యదర్శి వరిందర్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల కమిషనర్‌ తొలుత విడుదల చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారం ఓట్ల లెక్కింపు మార్చి 15న నిర్వహించాల్సి ఉంది. అయితే షెడ్యూల్‌లో మార్పు చేస్తూ లెక్కింపు తేదీని 20వ తేదీకి మార్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement