గంగమ్మకు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పూజలు | MLA Sudheer reddy poojas to water | Sakshi
Sakshi News home page

గంగమ్మకు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పూజలు

Sep 25 2016 11:43 PM | Updated on Mar 28 2018 11:26 AM

గంగమ్మకు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పూజలు - Sakshi

గంగమ్మకు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పూజలు

మండలంలో కురుస్తున్న వర్షాల కారణంగా నిండితున్న చెరువులు, కుంటలను పరిశీలించేందుకు ఆదివారం మేడ్చల్‌ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా శామీర్‌పేట్‌ పెద్ద చెరువు వద్ద తూమును పరిశీలించారు.

శామీర్‌పేట్‌: మండలంలో కురుస్తున్న వర్షాల కారణంగా నిండితున్న చెరువులు, కుంటలను పరిశీలించేందుకు ఆదివారం మేడ్చల్‌ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా శామీర్‌పేట్‌ పెద్ద చెరువు వద్ద తూమును పరిశీలించారు. సగానికి చేరుకున్న శామీర్‌పేట్‌ పెద్ద చెరువులో నీటిని పరిశీలించిన ఆయన మండలంలోని వర్షాల వల్ల ఎన్ని చెరువులు నిండాయి.. వాటి వివరాలు వరద నీటితో వస్తున్న సమస్యలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం దేవరయాంజాల్‌లోని చెన్నరాయుడుచెరువు అలుగులను సందర్శించి గంగమ్మకు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రశేఖర్‌యాదవ్‌, శామీర్‌పేట్‌, దేవరయాంజాల్‌ సర్పంచులు బత్తుల కిశోర్‌యాదవ్‌, శ్రీనివాస్‌ముదిరాజ్‌, మాజీ ఎంపీపీ నాలిక యాదగిరి, ఉప సర్పంచ్‌ నర్సింగ్‌, వార్డుసభ్యులు ప్రకాశ్‌, మహేశ్‌, రాజు, వీరారెడ్డి, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement