ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఘెరావ్ | mla gadde rammohan protested by locals at vijayawada government hospital | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఘెరావ్

May 2 2016 6:08 PM | Updated on Sep 3 2017 11:16 PM

విజయవాడలో ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా కారణంగా చీమలు కుట్టి నాలుగు రోజుల పసికందు మరణించడంపై ప్రజా సంఘాలు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

విజయవాడ: విజయవాడలో ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా కారణంగా చీమలు కుట్టి నాలుగు రోజుల పసికందు మరణించడంపై ప్రజా సంఘాలు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరామర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ను ఘెరావ్ చేశారు. ఎమ్మెల్యే డౌన్, డౌన్.. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఆస్పత్రిలో సౌకర్యాలు కల్పించకుండా పరామర్శకు వస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆస్పత్రి వద్ద ప్రజా సంఘాలు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేయడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత ఏర్పడింది. పసికందు మృతికి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ బాధ్యత వహించి, మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement