మిర్యాలగూడ, కేతేపల్లిని ‘పేట’ జిల్లాలో కలపాలి | miryalaguda, kethepalli are include in suyapeta dist | Sakshi
Sakshi News home page

మిర్యాలగూడ, కేతేపల్లిని ‘పేట’ జిల్లాలో కలపాలి

Aug 25 2016 10:22 PM | Updated on Sep 4 2017 10:52 AM

మిర్యాలగూడ, కేతేపల్లిని ‘పేట’ జిల్లాలో కలపాలి

మిర్యాలగూడ, కేతేపల్లిని ‘పేట’ జిల్లాలో కలపాలి

సూర్యాపేటటౌన్‌ : నూతనంగా ఏర్పడిన సూర్యాపేట జిల్లాలో మిర్యాలగూడ డివిజన్‌తోపాటు కేతేపల్లి మండలాన్ని కూడా కలపాలని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి పెద్దిరెడ్డి రాజా, ఆమ్‌ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్‌ లింగిడి వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు.

సూర్యాపేటటౌన్‌ : నూతనంగా ఏర్పడిన సూర్యాపేట జిల్లాలో మిర్యాలగూడ డివిజన్‌తోపాటు కేతేపల్లి మండలాన్ని కూడా కలపాలని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి పెద్దిరెడ్డి రాజా, ఆమ్‌ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్‌ లింగిడి వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మిర్యాలగూడను రాజకీయ ఒత్తిళ్ల మేరకు నల్లగొండ జిల్లాలోనే కొనసాగిస్తున్నట్టు ముసాయిదాలో ఉందన్నారు. ప్రస్తుత ముసాయిదా బిల్లు ప్రజలకు అనుకూలంగా లేదని, ప్రజల అభిప్రాయాల మేరకు మిర్యాలగూడ, కేతేపల్లిని సూర్యాపేటలో కలిపి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రజా హక్కుల పరిష్కార వేదిక అధ్యక్షుడు పాల్వాయి జానయ్య, నవీన్, నాగరాజు, వెంకన్న, సైదులు, రాజు, హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement