మంత్రిగారా.. మజకా! | minister.. wonder! | Sakshi
Sakshi News home page

మంత్రిగారా.. మజకా!

Aug 17 2016 4:13 AM | Updated on Aug 30 2019 8:37 PM

మంత్రిగారా.. మజకా! - Sakshi

మంత్రిగారా.. మజకా!

వినియోగంలో ఉన్న నెట్‌వర్కింగ్‌ సెంటర్‌కు మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభోత్సవం చేశారు.

వినియోగంలో ఉన్న నెట్‌వర్కింగ్‌ కేంద్రానికి ప్రారంభోత్సవం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): రాయలసీమ యూనివర్సిటీలో వినియోగంలో ఉన్న నెట్‌వర్కింగ్‌ సెంటర్‌కు మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభోత్సవం చేశారు. ఇప్పటికే ఇది పనిచేస్తోంది. ఈ కేంద్రంలో వర్సిటీలోని వైఫై నెట్‌వర్కింగ్‌ సిస్టిమ్‌ ఉంది. దీనిని దాదాపు పది నెలల క్రితమే వైస్‌ చాన్సులర్‌ ప్రారంభోత్సవం చేశారు.

అయితే మంగళవారం ఉర్దూ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి గంటా శ్రీనివాసరావుతో ఆర్‌యూలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌పై ప్రిన్సిపాళ్లతో ముఖాముఖి అయ్యారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఏదో ఒక్కటి ప్రారంభించాలనే తపనతో నెట్‌వర్కింగ్‌ సెంటర్‌కు మళ్లీ ప్రారంభోత్సవం చేశారు. అలాగే 15 వందల మంది కూర్చునేందుకు వీలున్నా ఓపెయిన్‌ ఎయిర్‌ థియేటర్‌కు కూడా మంత్రి ప్రారంభోత్సవం చేశారు. ప్రారంభోత్సవం సమయానికి తాము అక్కడ ఉన్నా పట్టించుకోలేదని అవమానం జరిగిందని ఈసీ మెంబర్‌ జీటీ నాయుడు ఆవేదన వ్యక్తం చేస్తూ వెళ్లిపోయారు.

 

Advertisement
 
Advertisement
Advertisement