మంత్రి తలసాని కొడుకుపై కిడ్నాప్ కేసు | minister talasani srinivas yadav son in kidnap case | Sakshi
Sakshi News home page

మంత్రి తలసాని కొడుకుపై కిడ్నాప్ కేసు

Oct 30 2015 7:44 PM | Updated on Sep 3 2017 11:44 AM

మంత్రి తలసాని కొడుకుపై కిడ్నాప్ కేసు

మంత్రి తలసాని కొడుకుపై కిడ్నాప్ కేసు

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు వివాదంలో చిక్కుకున్నాడు. తన భార్యను తలసాని కుమారుడు కిడ్నాప్ చేశాడంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు.

హైదరాబాద్: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు వివాదంలో చిక్కుకున్నాడు. తన భార్యను తలసాని కుమారుడు కిడ్నాప్ చేశాడంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి కిరణ్ తన భార్యను కిడ్నాప్ చేసి దాడికిపాల్పడ్డాడని అభినవ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ వివాదంలో మరికొందరు కూడా ఉన్నారని చెప్పాడు. దీంతో సాయి కిరణ్ సహా నలుగురిపై మారేడ్ పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. అభినవ్ మారేడ్ పల్లికి చెందిన యువతిని గత రెండేళ్ల క్రితం ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అయితే, ఆమెను తల్లిదండ్రులు బలవంతంగా తీసుకెళ్లినట్లు అభినవ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. భార్య కోసం మామ ఇంటికి వెళ్లగా అతడిపై మామ తరుపు బంధువులు దాడి చేశారు. అయితే, తన భార్య కిడ్నాప్, దాడి వెనుక మంత్రి తలసాని కుమారుడి హస్తం ఉందని అభినవ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement