నువ్వే కావాలి, ప్రేమించు వంటి సినిమాలతో ఒకప్పుడు వెండితెరపై సందడి చేశాడు సాయి కిరణ్ (Actor Sai Kiran). ప్రస్తుతం మాత్రం బుల్లితెరపై పలు సీరియల్స్ చేస్తూ బిజీ అయ్యాడు. కోయిలమ్మ సీరియల్‌లో నటించే సమయంలో సహనటి స్రవంతి (Actress Sravanthi)తో ప్రేమలో పడ్డాడు. 2024 డిసెంబర్‌లో పెళ్లి చేసుకున్నాడు. ఇటీవలే స్రవంతి.. తాను గర్భం దాల్చిన విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది.
ఫ్యామిలీలో కొత్త మెంబర్
తాజాగా తమ కుటుంబంలోకి కొత్త మెంబర్ చేరినట్లు తెలిపింది. ఏంటి? అప్పుడే డెలివరీ అయిందా? అనుకునేరు.. కాదు! స్రవంతి భర్త కోసం రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కానుకగా ఇచ్చింది. ఈ మేరకు ఓ వీడియోతోపాటు పలు ఫోటోలు షేర్ చేసింది. బుల్లెట్ బైక్ అంటే తన భర్తకు ఎంతో ఇష్టమని చెప్తోంది. అందుకే ఈ బైక్‌ను కానుకగా ఇచ్చినట్లు తెలిపింది.

గతేడాది థార్.. ఇప్పుడు బైక్
స్రవంతి షేర్ చేసిన వీడియోలో వీరిద్దరూ కొత్త బైక్ ముందు కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. తర్వాత జంటగా ఫోటోలకు పోజిచ్చారు. గతేడాది వీరు మహీంద్రా థార్ సొంతం చేసుకున్నారు. ఏడాది తిరిగేసరికి ఇప్పుడు బుల్లెట్ బైక్ కొన్నారు. ఇది చూసిన అభిమానులు సాయికిరణ్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.


